ప్రభాస్ హీరోగా నటించిన మున్నా మూవీ( Munna movie ) మీకందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఇలియానా హీరోయిన్ గా నటించింది.2007లో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను చాలా డిసప్పాయింట్ చేసింది అని అందరూ అంటూ ఉంటారు.ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
చత్రపతి సినిమా తీసి మంచి విజయాలలో ఉన్నటువంటి ప్రభాస్ కి ఆ తర్వాత అనేక ఫ్లాపులు వచ్చాయి.పౌర్ణమి, యోగి, మున్నా తదితర సినిమాలు అందులో ఉన్నాయి.
అయితే ఎలాగైనా ప్రభాస్ కి మన హిట్టు ఇవ్వాలని భావించిన దిల్ రాజు యోగి సినిమా మొదట నిర్మించాడు.

అది పోవడంతో మున్నా సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనుకున్నాడు కానీ అది కూడా 15 కోట్లతో నిర్మించగా అనుకున్న మేర కలేక్షన్స్ మాత్రం సాధించలేదు.కానీ ఈ చిత్రం 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది అలాగే 15 సెంటర్లలో 50 రోజుల పాటు ఆడింది.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే తాను ఒప్పుకోనని దిల్ రాజు( Dil Raju ) ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
పైగా మున్నా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగానే ఆ విషయాన్ని చెప్పడానికి దిల్ రాజు స్వయంగా ప్రభాస్ దగ్గరికి వెళ్లి చాలా ఇబ్బంది పడుతూ చెప్పాడట నీకు హిట్ ఇవ్వలేకపోతున్నాను ప్రభాస్ సారీ అంటూ చెప్పాడట./br>

ఇక ఈ సినిమా పరాజయానికి ముఖ్య కారణం స్టోరీ ఫైనల్ చేసుకున్నాక ఉన్నటు వంటి అంశాలు ఔట్పుట్ లో మాత్రం రాలేదట అంటే అనుకున్న స్టోరీ ఒకటి వచ్చిన సినిమా మరొకటి అందువల్లే అది పరాజయం పాలయ్యింది అనేది దిల్ రాజు వేస్తున్న అంచనా.పైగా అప్పట్లో ఇలియానా( Ileana ) ఉంటే ఆ సినిమా హిట్ అని భావించేవారు.ఆ రోజుల్లో ఆమె 80 లక్షల రూపాయలు రేమూనారేషన్ గా తీసుకుంది.
కానీ ఈ సినిమాకు ఒక రికార్డు కూడా ఉంది అత్యధిక క్యాసెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా మున్నా సినిమా రికార్డు సృష్టించింది.ఈ సినిమాకి సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ కావడం విశేషం.
ఇందులోని పాటలు అన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.







