ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలపై కాపీ ఆరోపణలు సాధారణమయ్యాయి.సినిమా హిట్టైన కొన్ని నెలల తర్వాత కాపీ ఆరోపణలు వినిపిస్తుండటం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర సినిమా( Magadheera movie ) రిలీజైన సమయంలో ఈ సినిమా చండేరి అనే నవలకు కాపీ అని కామెంట్లు వినిపించాయి.చండేరి నవలను ఈ సినిమా 80 శాతం పోలి ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మహేష్ నటించిన శ్రీమంతుడు, మహర్షి ( Srimanthudu, maharshi )సినిమాల కథలు తనవేనని శరత్ చంద్ర సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి.శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఇప్పటికే కోర్టు కేసు నడుస్తోంది.
బేబీ సినిమా( Baby movie ) కథ విషయంలో కూడా ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన బలగం మూవీ( Balagam movie ) గురించి కూడా ఒక జర్నలిస్ట్ కాపీ ఆరోపణలు చేయడం గమనార్హం.
అయితే వేణు ఆ ఆరోపణలను ఖండించారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అ.ఆ, గుంటూరు కారం ( A.Aa, Guntur Karam movie )సినిమాలు యద్ధనపూడి సులోచనరాణి నవలల నుంచి కాపీ కొట్టారని కామెంట్లు వినిపించాయి.ఆచార్య సినిమా( Acharya movie ) కథ నాదేనని ఒక రచయిత సంచలన ఆరోపణలు చేయగా సినిమా రిలీజ్ తర్వాత ఆ రచయిత సైలెంట్ ఆరోపణలు చేశారు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సింహా సినిమా కథ నాదేనని క్రెడిట్స్ ఇవ్వలేదని కొరటాల శివ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే టాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రం తమ సినిమాలు కాపీ అని అంగీకరించిన సందర్భాలు అయితే లేవు.కొన్నిసార్లు దర్శకులు కావాలని కాపీ కొట్టకపోయినా ఇద్దరు రచయితల ఆలోచనలు సేమ్ గా ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.భవిష్యత్తులో మరిన్ని సినిమాలపై ఈ కాపీ ఆరోపణలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.







