ఢిల్లీ( Delhi )లో రెండు రోజులపాటు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు భారత మండపం వేదికగా రేపు, ఎల్లుండి సమావేశాలను నిర్వహించనున్నారు.
ఇందులో ప్రధానంగా పార్టీ ప్రచార కమిటీతో పాటు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ( Narendra Modi )ని బీజేపీ ఎన్నుకోనుంది.ఈ క్రమంలోనే రేపు జాతీయ పదాధికారులు భేటీ కానున్నారని తెలుస్తోంది.
అలాగే రేపు మధ్యాహ్నం నుంచి బీజేపీ విస్తృత జాతీయ కౌన్సిల్ ( National Council meetings )సమావేశం జరగనుంది.ఆదివారం సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగనుంది.ప్రధాని అభ్యర్థితో పాటు పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు.