వాలెంటైన్స్ డే( Valentine’s day ) ఇటీవలే ముగిసింది.ఈ సందర్భంగా ప్రేమికులు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
కొంతమంది వాలెంటైన్స్ డే ఆర్ట్స్ అంటూ రకరకాల క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే వాటిని మాత్రం చాలా మందిని ఆకట్టుకుంది అదే ఆవుపై ప్రేమికుల ఆర్ట్ గీయడం.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఓ ఆవు( Cow )కు తాడు కట్టి ఒక వైపు తీసుకెళ్తున్నట్లు మనం చూడవచ్చు.ఆ ఆవు ముందు కాలుపై ఒక అందమైన అమ్మాయి పెయింటింగ్ వేసి ఉండటం కూడా మనం చూడవచ్చు.ఆవు వెనుక కాలు భాగంపై ఓ అబ్బాయి పెయింటింగ్ కూడా వేశారు.ఆ యువకుడు అమ్మాయికి ఫ్లవర్ ఇస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే( Happy Valentines Day ) చెబుతున్నట్లు ఈ ఆర్ట్ ను తీర్చిదిద్దారు.
చూసేందుకు ఇది అద్భుతంగా ఉంది.కానీ ఆవు ముఖం మాత్రం అలసిపోయినట్లుగా కనిపించింది.కాబట్టి ఈ ఆర్ట్ వల్ల అది కాస్త బాధకు గురై ఉంటుందేమో అనిపిస్తుంది.

@RainMaker1973 ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి 2 కోట్ల 47 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ ఆర్ట్ చాలా ఫన్నీగా ఉందని చాలామంది కామెంట్లు పెట్టారు.
అయితే ఈ ఆవుకు హానికరమైన రసాయనాలు ఉన్న పెయింట్ వేయడం వల్ల అది అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వాటికి చర్మ వ్యాధులు వస్తే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.
జంతువులు మనుషుల సరదా కోసం పుట్టలేదని మరికొందరు ఫైర్ అయ్యారు.ఇది చాలా క్రియేటివ్ ఐడియా అని ఒక యూజర్ పాజిటివ్‌గా కామెంట్ చేశారు.
ఈ ఆవు ఓ తల్లిగా కూడా కనిపిస్తోంది.కాబట్టి దాని పాలు తాగే ఆవులకు కూడా హాని జరిగే అవకాశం ఉంది.







