Easwari Rao : ప్రతి హీరోకి తల్లి ఈమెనే… ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక దుమ్ము దులుపుతోందిగా !

ఈశ్వరి రావ్( Easwari Rao ) 16 అణాల తెలుగు అమ్మాయి.1990 నుంచి నేటి వరకు నటిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే ఉంది.తెలుగులోనే మొట్టమొదటిసారి 1990లో ఇంటింటా దీపావళి( Intinta Deepavali ) అనే చిత్రం ద్వారా సహాయక నటి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.నటిగా పాత్రలు రావాలని మాత్రమే కలలు కంది ఈశ్వరి కానీ ఏ రోజు హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు.

 Eeshwari Rao Movies In Telugu Now-TeluguStop.com

అందుకేనేమో ఆమెకు సరైన లీడ్ రోల్స్ ఎప్పుడూ లభించలేదు.తెలుగులో ఆమె నటించిన మొట్టమొదటి లీడ్ రోల్ ఉన్న సినిమా రాంబంటు.ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కి భార్యగా ఆమె నటించింది.ఆ తర్వాత దాదాపు మూడు నాలుగు ఏళ్ల పాటు ప్రధాన పాత్రలోనే కనిపిస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అవలేదు.

దాంతో 2000 సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సహాయక పాత్రలు చేయడానికి ఆమె మొగ్గు చూపారు.

Telugu Salaar, Easwari Rao, Guntur Kaaram, Kaala, Legend, Mahesh Babu, Prabhas-M

ఆమెకు తమిళ డైరెక్టర్ మరియు నటుడు అయినా ఎల్ రాజా తో వివాహం కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.2006 వరకు ఆమె ఒకటి రెండు సినిమాలు చేస్తూ వచ్చిన ఆ తర్వాత పిల్లల కోసం పూర్తిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత లెజెండ్ సినిమా( Legend )లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది ఈశ్వరి.

తను ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా ఇచ్చింది మాత్రం తెలుగు వారే.అలాగే గుర్తింపు ఉన్న పాత్రలు కూడా ఎక్కువగా తెలుగులోనే దొరికాయి.

లెజెండ్ తర్వాత ఆమె వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.తల్లిగా, అత్తగా ఎక్కువగా పాత్రలు చేస్తూ వస్తున్నారు ఈశ్వరి రావు.

ఆమె ఇటీవల పోషించిన రజిని కాలా సినిమాలో మంచి పాత్ర దొరికింది.ఆ తర్వాత కూడా తమిళ్లో పెద్దగా బిజీ కాలేక పోయింది.

ఇప్పుడు ప్రస్తుతం తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలో నటిస్తుంది.

Telugu Salaar, Easwari Rao, Guntur Kaaram, Kaala, Legend, Mahesh Babu, Prabhas-M

ఉదాహరణకు 2023 సంవత్సరం తీసుకుంటే వీరసింహారెడ్డి, పెద్దకాపు, దూత, పిండం, సలార్ పార్ట్ వన్ వంటి సినిమాల్లో ఆమె నటించింది.అలాగే ఈ ఏడాది గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )లో మహేష్ బాబుకు అత్త పాత్రలో నటించింది.ఆమె యాసా, భాషా చాలా చక్కగా ఉంటాయి.

ఈజీగా జనాలు ఆమెకు కనెక్ట్ అవుతారు.అందుకే ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు దొరుకుతున్నాయి.

ఈశ్వరి రావు కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.వెటకారంతో కూడిన ఆమె మాటలు జనాలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఏదేమైనా ఇలాంటి ఒక నటి హీరోయిన్ ఒకప్పుడు కాలేకపోయినా ఇప్పుడు హీరోయిన్స్ కి మంచి క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube