ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.రాష్ట్ర కోటాలో మొత్తం మూడు స్థానాలు ఖాళీలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ( ycp )నుంచి ముగ్గురు నేతలు నామినేషన్లను దాఖలు చేశారు.వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి మరియు గొల్ల బాబురావులను అభ్యర్థులుగా పార్టీ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

అయితే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి ప్రతిపక్ష పార్టీ టీడీపీ దూరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని చెప్పుకోవచ్చు.ఏకగ్రీవం లాంఛనం కాగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







