ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోలార్( Solar ) సైకిళ్ల తయారీ మన భారతీయులే తయారు చేస్తున్నారు.ఈ సోలార్ సైకిల్ ( Solar cycle )ను సాధారణ సైకిల్ లాగే తొక్కవచ్చు.
ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం లాగా నడపవచ్చు.అంటే మోటర్ సైకిల్ తరహాలో ఉపయోగించుకోవచ్చు.
భారతదేశంలో ఈ సోలార్ సైకిళ్లను బరోడా ఎలక్ట్రిక్ మీటర్స్ లిమిటెడ్ కంపెనీ ( Baroda Electric Meters Limited Company )అభివృద్ధి చేస్తోంది.వల్లభ్ విద్యాసాగర్ లోని బిర్లా విశ్వకర్మ మహా విద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో వరల్డ్ వైడ్ ఫస్ట్ సోలార్ సైకిల్ రోల్ అవుట్, డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పేరుతో సోలార్ ప్రాజెక్ట్ స్టార్టప్ గా ప్రారంభమైంది.

ఈ సోలార్ సైకిల్ నమూనాను రుషీ షా, ముస్తఫా మున్షీ, మోహతా, హితార్థ్ సోలంకి ( Rushi Shah, Mustafa Munshi, Mohta, Hitharth Solanki )అనే ఇంజనీరింగ్ విద్యార్థులు అభివృద్ధి చేశారు.ఈ సోలార్ సైకిల్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు ఏంటంటే.ఈ సోలార్ సైకిల్ లో మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ చార్జ్ కంట్రోలర్ ను అమర్చారు.ఇందులో ఈ-బ్యాటరీ 40 ఓల్డ్ సోలార్ ప్యానల్ ను అమర్చారు.
ఈ సోలార్ సైకిల్ ను నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.ఒకవేళ సాధారణ ఎండ ఉంటే ఫుల్ ఛార్జ్ కు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.

ఈ సోలార్ సైకిల్ లో సోలార్ ప్యానల్ మౌంట్ అమర్చడం వల్ల గాజు పగిలిపోకుండా నిరోధిస్తుంది.ఈ సోలార్ సైకిల్ 12 వోల్ట్లు, 40 వోల్ట్ తక్కువ వోల్టేజ్ వద్ద పనిచేస్తుంది.సోలార్ సైకిల్ లకు వన్ టైం చార్జ్ మెకానిజం కారణంగా పెద్ద బ్యాటరీ అవసరం అయితే 5Ah బ్యాటరీ సౌర చక్రానికి సరిపోతుంది.ఈ సోలార్ సైకిల్ పర్యావరణ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ అధికారుల ప్రశంసలు అందుకుంది.
భారతదేశంలో తొలి సోలార్ సైకిల్ స్వదేశీయంగా తయారు చేయడం విశేషం.







