తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర( Jabardasth Lady Comedian Pavitra ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలె జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర అతి తక్కువ సమయంలోనే తనదైన శైలిలో కామెడీ చేసి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ), జీ తెలుగు మా టీవీ ఈవెంట్లు అంటూ సందడి చేస్తూ బాగానే సంపాదిస్తోంది.అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
ఇకపోతే గత ఏడాది ఈమె తన ప్రియుడు సంతోష్ ( Santhosh ) ని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేయడంతో పాటు తన యూట్యూబ్ ఛానల్ లో శ్రీకాంత్ తో కలిసి ఎన్నో ప్రాంక్ వీడియోలు చేసి అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది.

అంతేకాకుండా గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ ని ఎంగేజ్మెంట్( Pavitra Santhosh Engagement ) కూడా చేసుకుంది.ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రేమికుల దినోత్సవం రోజున ఆమె అభిమానులకు ఒకసారిగా షాక్ ఇచ్చింది.
అయితే ఒక రకంగా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు.సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్‌తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే( Valentines Day ) సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది.మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను.

సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము.మా మార్గాలు వేరుగా ఉన్నా.మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం.జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత( Privacy ) ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ,మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు అని తెలిపింది పవిత్ర.
ఇది రియలా లేక ఇది కూడా ఫ్రాంక్ చేస్తున్నారా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.గతంలో తన బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించడం కోసం అనేక రకాల ఫ్రాంక్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా అదే మాదిరిగా చేస్తోందా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.







