Hari Krishna : ఆ సీన్ కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టిన హరికృష్ణ.. ఇంత సాహసం ఎవరూ చేయరుగా!

నందమూరి హీరో హరికృష్ణ( Hari Krishna ) తన సినీ కెరీర్ లో నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.హరికృష్ణ వైవీఎస్ చౌదరి( Y V S Chowdary ) కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు అంచనాలను మించి మెప్పించిందనే సంగతి తెలిసిందే.

 Hero Harikrishna Risky Scene Shoot Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఈ సినిమాలోని ఒక సీన్ కోసం హరికృష్ణ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టారట.సినిమాలోని ఒక సీన్ లో హీరో హరికృష్ణ కారు విలన్ జయప్రకాష్ రెడ్డి( Jaya Prakash Reddy ) జీపు రైల్వే ట్రాక్ పై మధ్యలో ఆగుతాయి.ట్రైన్ రావడంతో జయప్రకాష్ రెడ్డి జీపు వెనక్కు వెళ్తుంది.ఆ తర్వాత హరికృష్ణ కారు ముందుకు వచ్చేలా సీన్ ప్లాన్ చేశారు.అయితే ఆ సమయంలో కారు స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా స్టార్ట్ కాలేదట.

సాధారణంగా ఇలా జరిగితే ఎవరైనా కారులో నుంచి బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే హరికృష్ణ మాత్రం ఎదురుగా రియల్ ట్రైన్ వస్తున్నా ప్రయత్నించి మూడో ప్రయత్నంలో స్టార్ట్ చేశారట.ఈ సీన్ తర్వాత సినిమాలో “మగాడన్నాక తెగింపు ఉండాలిరా.చావుకు మనం భయపడకూడదు.చావే మనల్ని చూసి భయపడాలి” అనే డైలాగ్ ను చెబుతారు.ఈ డైలాగ్ నిజంగానే హరికృష్ణకు సూట్ అవుతుందని హరికృష్ణకు ఆ తెగింపు ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హరికృష్ణ భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా కళ్యాణ్ రామ్ మాత్రం కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube