బంగాళాదుంప( Potato ) ఒక శీతాకాలపు పంట.బంగాళాదుంప సాగుకు చల్లని వాతావరణం అవసరం.
అధిక ఉష్ణోగ్రత ఉంటే బంగాళాదుంపల్లో పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది.నీటి వసతి ఉండే ఇసుక నేలలు, ఎర్ర గరప నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.
ఆమ్లా లక్షణాలు, బరువైన నేలలు బంగాళాదుంప పంట సాగుకు పనికిరావు.బంగాళా దుంప సాగుకు మేలు రకం రకాల విషయానికి వస్తే.
కుఫ్రీ లాలమి, కుఫ్రీ బాద్ షా, కుఫ్రీ సింధూర్, కుఫ్రీ ఆనంద్ లాంటి రకాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనుకూలంగా ఉంటాయి.

బంగాళదుంప సాగు( Potato Farming ) చేసే నీళ్లను వేసవికాలంలో 4 లేదా 5 సార్లు దుక్కి దున్నుకోవాలి.ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.ఇక మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి.
దుంపలను విత్తన శుద్ధి చేసుకుని నాటుకుంటే వివిధ రకాల చీడపీడలు లేదా తెగులు ఆశించకుండా ఉంటాయి.ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల మాంకోజెబ్ ను పి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాల పాటు బంగాళా దుంపలను ఉంచాలి.
తర్వాత పొలంలో నాటుకోవాలి.

బంగాళదుంప నాటిన 90 నుంచి 100 రోజుల లోపు కోతకు వస్తుంది.అయితే ఈ పంటకు బ్యాక్టీరియా( Bacteria ) కుళ్ళు తెగుళ్లు ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవలసి వస్తుంది.ఈ బ్యాక్టీరియా బంగాళా దుంపకు వ్యాపిస్తుంది.
దెబ్బ తగిలిన మొక్క వేర్ల ద్వారా మొక్కకు ఆశించి తక్కువ కాలంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.ఒక లీటరు నీటిలో 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్( Bleaching Powder ) కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
ఎకరం పొలానికి 8 కిలోల బ్లీచింగ్ పౌడర్ అవసరం.బంగాళదుంప పంటకు చీడపీడలు లేదంటే తెగులు ఆశిస్తే తొలి దశలోనే అరికడితే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 12 నుండి 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.







