రోడ్‌పై వాహనం నడపాలంటే కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది.వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ రూల్స్ రూపొందించబడ్డాయి.
ఆ అతి ముఖ్యమైన రూల్స్ లో ఒకటి రోడ్ మీద బైక్ పై( Bike ) వెళ్ళేటపుడు హెల్మెట్ పెట్టుకోవడం.అలానే అతివేగంగా వెళ్లకుండా వాహనం కంట్రోల్ అయ్యే రేంజ్ లో డ్రైవ్ చేయడం.
ఇక బైక్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి అంతకుమించి ప్రయాణించకూడదు.ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే బైకు సరిగా కంట్రోల్ అవ్వకపోవచ్చు.
ఇలా కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి.వాటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదు.

ప్రస్తుతం ఒక వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ కి( Traffic Rules ) విరుద్ధంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆ వ్యక్తి చేసిన పని చుస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియో లో ఒక వ్యక్తి తన బైక్ మీద ఇద్దరు మహిళలను కుర్చోపెట్టుకొని బైక్ నడుపుతున్నాడు.అంతవరకు పర్వాలేదు కానీ అసలు వింత ఏంటంటే వెనక ఇద్దరు మహిళలు కాకుండా ముందు బైక్ ట్యాంక్ పై మరో మహిళ కూర్చుంది.

హైవే పై వెళ్తున్న ఆ బైక్ ని చుట్టుపక్కన వాళ్లంతా ఆశ్చర్యపోయారు.ఆ వింత ఘటనను అంకిత్( Ankit ) అనే వ్యక్తి తన ఖాతాలో @terakyalenadena నుంచి మైక్రో బ్లాకింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియోని షేర్ చేసాడు.ఇప్పటికే ఈ వీడియోకి 67 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.అలానే రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు.కొంతమంది ‘ సోదరా ఈ వీడియో చూసాక సిగ్గుతో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది.’ అని కామెంట్ చేస్తే, మరికొందరేమో ‘ ఇది యానిమల్ సినిమాకి చెందిన బాబీ డియోల్’ అని రాసుకొచ్చారు.ఇక ఈ వీడియో ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) కంట పడితే బైక్ నడిపే సోదరుడికి ఎలాంటి శిక్ష వేస్తారో ఏమో.







