సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంతమంది దర్శకులు వాళ్ళకి సక్సెస్ లను ఇచ్చి ఇండస్ట్రీలో వాళ్ళు టాప్ హీరోలుగా ఎదగడానికి సహాయం చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వారు టాప్ హీరోలుగా ఎదిగిన తర్వాత కెరియర్ మొదట్లో ఏ డైరెక్టర్లు అయితే వాళ్లకి హెల్ప్ చేశారో మళ్లీ వాళ్ళతోనే సినిమాలు చేసి వాళ్ళని కూడా టాప్ డైరెక్టర్లుగా మార్చాలని చూస్తూ ఉంటారు.
కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా ఎదిగిన తర్వాత వాళ్లకి కెరియర్ మొదట్లో హెల్ప్ చేసిన దర్శకులను పట్టించుకోరు.

ఇక ఇలాంటి క్రమం లోనే జగపతిబాబు( Jagapathi Babu ) కూడా అదే కోవకి చెందినవాడు అంటూ వి సముద్ర ( V Samudra )చెప్పడం సంచనాలను సృష్టిస్తుంది.ఇక వివరాల్లోకి వెళితే దర్శకుడు వి సముద్ర జగపతిబాబుతో శివరామరాజు, అధినేత( Sivaramaraju, Adinetha ) అనే సూపర్ హిట్ సినిమాలు చేసి అతనికి సూపర్ హిట్లు అందించాడు.ఎప్పుడైతే జగపతిబాబు డౌన్ లో ఉన్నాడో ఆ సందర్భంలో ఈ రెండు సినిమాలు అతనితో చేసి అతనికి ఒక హై ఇచ్చాడు.
అలాగే మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు వి సముద్ర కెరియర్ చాలా డల్ గా ఉంది ఆయనకు అవకాశం ఇచ్చే హీరోలు కరువయ్యారు.దాంతో ఆయన ఇప్పుడు ఎలాగైనా హిట్ సాధించాలని చూస్తున్నాడు.

దాంతో ఒక స్టోరీని జగపతి బాబు కి వినిపించినప్పటికీ ప్రస్తుతం తను ఉన్న బిజీ కి అలాగే తను తీసుకునే రెమ్యున్ రేషన్ కి ఈ సినిమా తనకు వర్కౌట్ కాదని జగపతిబాబు తన మొహం మీదే చెప్పేశాడట.దాంతో వి సముద్ర చాలా వరకు బాధపడినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.ఇక దీన్ని బట్టి జగపతిబాబు గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు…
.







