తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ఇమేజ్ అనేది ఉంటుంది.అయితే ఒక హీరో ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేస్తుంటే మరొక హీరో మరో టైపు సినిమాలు చేయడం లో కింగ్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.
అన్ని రకాల జానర్లని హ్యాండిల్ చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ కోసం తహతహలాడుతూ ఉంటారు.
సరిగ్గా ఇదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆర్.నారాయణమూర్తి( R.Narayanamurthy ) లాంటి హీరోలు కమ్యూనిజానికి సంబంధించిన భావజాలంతో సినిమాలను తెరకెక్కించేవారు.

మరి ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి.అయితే ఆర్ నారాయణ మూర్తి ఇండస్ట్రీకి రాకముందు నాగేశ్వరరావు వీరాభిమానిగా ఉండేవాడు.ఆ సమయం లోనే ఎన్టీఆర్( NTR ) అంటే అతనికి నచ్చేది కాదు.
కేవలం నాగేశ్వరరావు( Nageswara Rao ) సినిమాలకు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తు ఆయన సినిమాతో చూస్తూ ఉండేవాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ అంటే ఆయనకి పెద్దగా నచ్చేది కాదని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు.

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాత్రం ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి రెండు రెండు కండ్లు గా భావించానని చెప్పాడు అలాగే ఇన్ని రోజులు ఒక మహానుభావుడు సినిమాలను నేను చూడకుండా మిస్ అయ్యాను అంటూ ఎన్టీఆర్ గురించి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి అడపదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు ను సంపాదించుకుంటున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఆయన కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసే అవకాశం వచ్చినప్పటికి దానిని ఆయన చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు…
.







