బీహార్( Bihar ) లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరి కాసేపటిలో బలపరీక్షను ఎదుర్కోనుంది.
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత సభలో సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) బలాన్ని నిరూపించుకోనున్నారు.మహాకూటమి ప్రభుత్వం రద్దు అయిన తరువాత బీహార్ లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా .బలపరీక్ష నెగ్గాలంటే ఎన్డీఏకు 122 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.అయితే తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఎన్డీఏ కూటమి తెలిపింది.ఇందులో బీజేపీ 78, జేడీయూ 45, హెచ్ఎంఎం 4 మరియు స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారని ఎన్డీఏ కూటమి చెబుతోంది.
ఈ నేపథ్యంలో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.