Bihar : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష..!

బీహార్( Bihar ) లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరి కాసేపటిలో బలపరీక్షను ఎదుర్కోనుంది.

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత సభలో సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) బలాన్ని నిరూపించుకోనున్నారు.

మహాకూటమి ప్రభుత్వం రద్దు అయిన తరువాత బీహార్ లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

"""/" / బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా .

బలపరీక్ష నెగ్గాలంటే ఎన్డీఏకు 122 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.అయితే తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఎన్డీఏ కూటమి తెలిపింది.

ఇందులో బీజేపీ 78, జేడీయూ 45, హెచ్ఎంఎం 4 మరియు స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారని ఎన్డీఏ కూటమి చెబుతోంది.

ఈ నేపథ్యంలో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?