సాధారణంగా మనం కాలి నడకన వెళ్లే ప్రజల కోసం లిఫ్ట్ లేదా ఎస్కలేటర్( Escalator ) గురించి వింటాం.అయితే సైకిల్ పై వెళ్లే వారి కోసం కూడా ఎస్కలేటర్ లేదా లిఫ్ట్ అనేది ఉంటుందని మీకు తెలుసా? తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సైకిల్ ఎస్కలేటర్( Cycle Escalator ) అనేది ప్రజలు తమ సైకిళ్లపై నిటారుగా ఉన్న కొండపైకి వెళ్లేందుకు సహాయపడే పరికరం.ఇది సైకిల్‌పై కూర్చున్న రైడర్‌ను ఏటవాలుగా ఉంటే కొండలాంటి ప్రదేశాల్లో పైకి నెడుతుంది.
ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో రైడర్ గట్టిగా తొక్కడం లేదా బైక్ నుంచి దిగడం అవసరం లేదు.వారు కేవలం ప్లాట్‌ఫామ్‌పై ఒక కాలు వేసి బ్రేకులు పట్టుకోవాలి.
వైరల్ వీడియోలో చూస్తున్నారు కదా.కొందరు యువ సైకిలిస్టులు ఒక ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక రేకు లాంటి వస్తువుపై కాలును ఉంచారు.అప్పుడు అది వారి కాలును పైకి నెడుతుంది.దీనివల్ల వారు సైకిల్ తొక్కాల్సిన అవసరం లేకుండానే పైకి వెళ్తున్నారు.సాధారణంగా కొండపైకి ( Mountain ) సైకిల్ తొక్కుతూ వెళ్లాలంటే చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది.ఫిట్నెస్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటి వారిని ఉద్దేశించి ఈ అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ( Platform ) తీసుకు రావాల్సి వచ్చింది.జపాన్, నార్వే వంటి అనేక మంది ప్రజలు రవాణా కోసం సైకిళ్లను ఉపయోగించే కొన్ని దేశాల్లో సైకిల్ ఎస్కలేటర్లు సర్వసాధారణం.ఇవి సాధారణంగా సబ్వే స్టేషన్లలో లేదా రద్దీగా ఉండే వీధుల్లో కనిపిస్తాయి.ఇవి సైక్లింగ్‌ను సులభతరం చేస్తారు, అన్ని వయసుల, సామర్థ్యాల వారికి మరింత అనుకూలంగా ఉంటాయి.