తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్( Vinod Kumar ) స్పందించారు.రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారన్న ఆయన ఎంబ్లంలో కాకతీయ తోరణం, చార్మినార్ చారిత్రక గుర్తులను తెలిపారు.
సామాన్య ప్రజల కోసం కాకతీయులు తపించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు అని తెలిపారు.
రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ చరిత్రను( Telangana History ) మరిపించే కుట్ర జరుగుతోందని తెలిపారు.రేవంత్ రెడ్డిపై ఆంధ్ర మేధావుల ప్రభావం ఉందన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయొద్దని కోరుతున్నామని తెలిపారు.