యువ సామ్రాట్ నాగార్జున గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున( Nagarjuna ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే విస్తరించుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇప్పటికీ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి.అయితే ఒకానొక సమయంలో నాగార్జున పాన్ ఇండియాలో రక్షకుడు అనే సినిమా చేశాడు ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.అయినప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ గాని, హీరో, హీరోయిన్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీ గాని బాగా వర్క్ అయింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా విశ్వసుందరి సుస్మితసేన్( Susmita Sen ) ను తీసుకున్నారు.

ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా డైరెక్టర్లు వీళ్ళిద్దరిని కపుల్స్ గా పెట్టి సినిమా చేయాలని అనుకున్నారు.కానీ ఒకసారి నాగార్జునతో భారీ ప్లాప్ వచ్చిన తర్వాత సుష్మితసేన్ మరొకసారి తనతో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదనే వార్తలు అప్పట్లో చాలా వినిపించాయి.ఎందుకంటే నాగార్జునతో ఆల్రెడీ ఒకసారి ఫ్లాప్ వచ్చింది కాబట్టి మరొకసారి నటించడం దేనికనే ఉద్దేశ్యం తోనే తను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే రక్షకుడు సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే ఆ సినిమాకి మైనస్ గా మారింది.
అప్పట్లో విమర్శకులు సైతం ఈ సినిమాను విమర్శించారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ దూసుకుపోతున్నాడు.ఇక రీసెంట్ గా నా సామి రంగ ( Naa Saami Ranga )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…
.







