ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.కలపర్రు టోల్ ప్లాజా( Kalabarru Toll Plaza ) వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.విజయవాడ నుంచి విశాఖకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.