తెలుగు ప్రేక్షకులకు నటి పర్ల్ మానే( Actress Pearl Mane ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కళ్యాణ వైభోగమే.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఈ సినిమా సక్సెస్ కాలేక పోయినప్పటికీ మంచి గుర్తింపుని తెచ్చుకుంది.మొదట్లో పాటల ప్రోగ్రామ్‌కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది.
యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
అలాగే ఈమె తెలుగులో నాగశౌర్య కళ్యాణ వైభోగమే ( Kalyana Vaibhogame movie )చిత్రంలో వైదేహి అనే పాత్రలో నటించింది.ఒకవైపు యాంకర్ గా సత్తాను చాటుతూనే మరొకవైపు నటిగా అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఈమె బిగ్‌బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్‌తో( actor Srinish Aravind ) లవ్‌లో పడిన పడిన విషయం తెలిసిందే.షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు.2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది.ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది.
తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు.
రెండో కూతురికి నితారా శ్రీనిష్( Nitara Srinish ) అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కాగా నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులు అవుతోంది.ఇది తన బారసాల.
మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి.మీ ఆశీర్వాదాలు కావాలి.
అంటూ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.పాప పేరు కూడా చాలా బాగుంది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.