కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ ( Ajith )కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అజిత్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటిస్తున్నారు.
అజిత్ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.అజిత్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో వీరమ్ ఒకటి కాగా ఈ సినిమాలో యువీనా పార్థవి ( Yuveena Parthavi )అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది.
ఈ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు అయింది.
యువీనా పార్థవి లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆమె రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ లో యువీనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ట్రెడిషనల్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా యువీనా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

యువీనా పార్థవి అన్ని భాషలు నేర్చుకుంటూ ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం.యువీనా పార్థవి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తమిళ, కన్నడ ఇండస్ట్రీలకు ఈ బ్యూటీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 71 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.యువీనా ఎలాంటి పాత్ర ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేసే టాలెంట్ ను కలిగి ఉన్నారు.

రాబోయే రోజుల్లో యువీనా పార్థవి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.యువీనాకు హీరోయిన్ గా నిర్మాతలు భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.యువీనా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
యువినా షేర్ చేసిన ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.







