ఈ మధ్య కాలంలో రవితేజ( Ravi Teja ) సినిమాలు హిట్ టాక్ వస్తే రికార్డులు క్రియేట్ చేస్తుంటే టాక్ ఆశించిన విధంగా లేకపోతే మాత్రం కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న రవితేజ ఈ ఏడాది ఈగల్ ( Eagle )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రవితేజ గత సినిమాలకు భిన్నమైన లుక్ ను ఎంచుకుని ఈ సినిమాలో కనిపించారు.
ఈగల్ సినిమాకు ట్విట్టర్ లో మిక్స్డ్ టాక్ వస్తోంది.
కొంతమంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తుండగా మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ మధ్యలో ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
హీరో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్( Background music ) విషయంలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని నెటిజన్లు చెబుతున్నారు.డైలాగ్స్, క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.కథనంలో కొన్ని పొరపాట్లు, ఎమోషనల్ గా ప్రేక్షకులను కనెక్ట్ చేసే విషయంలో ఫెయిల్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది.
రవితేజ మేకోవర్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండగా రవితేజ మాత్రం బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.సినిమాతోగ్రఫీ, నిర్మాణ విలువలు వేరే లెవెల్ లో ఉన్నాయి.
ఈగల్ కు పెద్ద సినిమాలతో పోటీ లేకపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి.రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలో తాము కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని చెబుతున్నారు.







