ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ‘వ్యూహం’ ( Vyuham )సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి.దీంతో ఈ నెల 16 న విడుదలకు సిద్ధం అయింది.
కోర్టు సూచనల మేరకు వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ పూర్తి అయింది.ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఆర్జీవీ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ కారణంగా సినిమా రిలీజ్ కావడానికి ముందే వివాదంలో చిక్కుకుంది.దివంగత నేత వైఎస్ఆర్ మరణం, ఏపీ వైఎస్ జగన్ పాదయాత్ర, ఆ తరువాత సీఎంగా ఎలా ఎదిగారనే కథనంతో ఈ చిత్రం రూపొందింది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ నారా లోకేశ్ కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా.పిటిషన్ విచారించిన కోర్టు సినిమాను మరోసారి పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే మరోసారి వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది.దీంతో వ్యూహాం చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.