ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం( SP Balasubrahmanyam ) అనే పేరు వింటేనే ఆయన పాడిన ఎన్నో సూపర్ హిట్ పాటలు మనకు టక్కున గుర్తు వచ్చేస్తాయి.సంగీత ప్రపంచానికి రారాజు ఆయన.
తళుక్కుమనే స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధులను ఆయన చేస్తారు.నేటికీ ఆయన పాడిన పాటలు ఆయన అభిమానులకు కంఫర్ట్‌కి తక్కువేం కాదు.
అతను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీతో సహా 16 భాషలలో 40,000 పాటలు పాడాడు.ఒక రోజులో అత్యధిక పాటలను పాడిన సింగర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ( Guinness World Record )కూడా ఆయన సాధించాడు.
అలాంటి వ్యక్తికి కూడా చనిపోయే వరకు ఒక తీరని కోరిక ఉండేదంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.దాని గురించిన ఆసక్తికర కథనం గురించి తెలుసుకుందాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.4 జూన్ 1946న మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు.అతని తండ్రి, దివంగత ఎస్.పి.సాంబమూర్తి( S.P.Sambamurthy ), నాటకాలలో కూడా నటించే వారు.అతని తల్లి శకుంతలమ్మ గృహిణి.
ఎస్పీబీ 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ అనే తెలుగు సినిమాతో తన సింగింగ్ కెరీర్ ప్రారంభించాడు.ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును ఆరుసార్లు గెలుచుకున్నాడు.1969 నుంచి ఆయన కెరీర్ ఊపందుకుంది.అయితే తెలుగులో అప్పటి టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులకు బాలు తక్కువగా పాటలు పాడేవారు.

విచిత్ర బంధం సినిమాలోని వయసే ఒక పూల తోట అంటూ శ్రోతలను అలరించిన రామకృష్ణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కేది.దీంతో కేవలం కృష్ణ గారికి మాత్రమే ఆయన పాడే వారు.మరో వైపు తమిళ్లో బాలు టాప్ సింగర్‌గా కొనసాగేవారు.అక్కడి స్టార్ హీరో ఎంజీఆర్‌కు బాలు పాడిన పాటలన్నీ హిట్ అయ్యేవి.కొన్నాళ్లకు ఏసుదాసుతో ఎంజీఆర్ ఎక్కువగా పాటలు పాడించే వారు.ఇలా తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలలో ఒక్కసారిగా బాలుకు అవకాశాలు తగ్గిపోయాయి.
ఆ తర్వాత మరిన్ని అవకాశాలు బాలుకు వచ్చాయి.దీంతో కొన్ని దశాబ్దాల పాటు ఆయన తిరుగులేని సింగర్‌గా కొనసాగారు.
తన కెరీర్ ఎంతో బాగుండే సమయంలో కూడా ఆయన ఓ విషయంలో బాధ పడేవారట.ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం( Classical music ) ఆయన నేర్చుకోలేదు.
తోటి సింగర్లంతా చక్కగా శాస్త్రీయ సంగీతంపై అవగాహన ఉండేది.కానీ ప్రతి రోజూ పాటలు పాడడం వల్ల నేర్చుకునే తీరిక లేదు.
కొన్నిసార్లు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలిసేది కాదు.ముఖ్యంగా పిల్లల చదువులు, వారి ఆరోగ్యం, వారితో కాసేపు గడపడం ఇలాంటివి ఆయన జీవితంలో దూరం అయ్యాయి.
ఏదేమైనా తన కెరీర్లో వేల సంఖ్యలో పాటలు పాడిన బాలుకు ఈ విషయంలో చివరి వరకు చిన్న అసంతృప్తులు ఉండేవి.







