యాదాద్రి భువనగిరి జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ కు తరలించే కుట్ర చేస్తుండని ఆలేరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు.గురువారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా యడాగిరిగుట్ట మండల కేంద్రంలో విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ
సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ కాలేజ్ తరలింపు ఆలోచనను వెంటనే విరమించుకోవాలని,మార్చి ఒకటో తేదీలోపు మెడికల్ కాలేజ్ పై స్పష్టత ఇవ్వకుంటే స్వయంగా రిలే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.







