జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి హస్తినకు వెళ్లనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను జనసేనాని పవన్ కలవనున్నారు.ఏపీలో పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై బీజేపీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ ప్రధానంగా చర్చించనున్నారు.
ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ), బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, టీడీపీ( TDP )తో సీట్ల సర్దుబాటుపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.కాగా ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చేలా ఏడాదిన్నర నుంచి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.