జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా గురువారం జిల్లాలోని సర్ధపూర్ బెటాలియన్ లో గల ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది.శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న,అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యవేక్షించారు.

 Firing Practice For District Police Officers And Staff, District Police Officers-TeluguStop.com

అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు.ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినదించారు.

ఈ శిక్షణలో డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి ,నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కిరణ్ కుమార్, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్ ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube