హీరో సూర్య భార్యగా హీరోయిన్ గా నటిగా జ్యోతికకు( Jyothika ) తమిళ ఇండస్ట్రీ తో పాటు సౌత్ ఇండియాలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అయితే ఈ మధ్యకాలంలో ఆమె ప్రొడ్యూసర్ గా, మెయిన్ లీడ్ యాక్ట్రెస్ గా, ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనిపిస్తూ తన సత్తా ఏంటో మరోసారి అందరికీ చూపిస్తున్నారు.
అయితే హీరో సిద్ధార్థ తో కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మీ దృష్టిలో నిజమైన హీరో ఎవరు అని చెప్పగానే అందరూ తన భర్త సూర్య పేరు చెబుతుందని అనుకున్నారు కానీ ఆమె చాలా భిన్నంగా దీనికి స్పందించారు
మరి ఈ నిజమైన హీరోగా( Real Hero ) జ్యోతిక దృష్టిలో ఉన్న హీరో ఎవరు ఎందుకు ఆమె అంతలా అతడిని అభిమానిస్తుంది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇంతకీ ఆమె అభిమాన హీరో ఎవరో తెలుసా అతడు ఎవరో కాదు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.
( Mammootty ) ఇటీవలే జ్యోతిక మమ్ముట్టితో కలిసి కథల్: ది కోర్ ( Kaathal: The Core ) అనే చిత్రంలో నటించింది.ఈ సినిమా షూటింగ్ లోకేషన్ కి జ్యోతిక వెళ్లిన తర్వాత నేరుగా వెళ్లి మమ్ముట్టిని కలిసిందట.

ఎందుకంటే ఆమెకు చాలా ఆసక్తిగా ఉండేదట ఎందుకు ఈ ఇలాంటి ఒక పాత్ర ఎంచుకున్నారు అని అడగాలని.ఎందుకంటే 72 ఏళ్ళ ఒక నటుడు హోమోసెక్సువల్ పాత్రలో నటించాల్సిన అవసరం ఏముంది ఒకవేళ కనుక ఆ ఈ పాత్ర జనాలు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇన్నేళ్లపాటు మమ్ముట్టి పడిన కష్టం అంతా కూడా బూడిదలు పోసిన పన్నీరు అయ్యేది.ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఈ వయసులో ఏమొచ్చింది అనే విషయాన్ని అడగాలనుకున్నారట.మమ్ముట్టిది ఈ విషయమే అడిగితే అతను చెప్పిన సమాధానం విని హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారట జ్యోతిక.
హీరో అంటే అర్థం ఏంటి ? హీరో అంటే నాలుగు ఫైట్లు, పాటలు మాత్రమే కాదు.

ఎలాంటి పరిస్థితి అయినా కూడా బ్యాలెన్స్ చేయగలగాలి.ఎలాంటి ఒక పాత్రనైనా ఛాలెంజ్ గా తీసుకుని చేయగలగాలి.అలాంటి వ్యక్తి హీరో అని అర్థం.
నేను నిజ జీవితంలో హీరోగా ఉండాలి అలాగే సినిమా జీవితం కూడా ఎంతో భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను.దానికి ఎలాంటి పాత్ర వచ్చిన ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పారట.
ఇలా ఇంతటి పెద్ద స్థాయిలో కూడా ఈగో పక్కన పెట్టి పైగా నిర్మాతగా కూడా మారి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ సక్సెస్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు.దాంతో జ్యోతిక తన అనుమానాలన్నీ అక్కడే వదిలేసి సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనం చూసాం ఇది తెలుగులో ఓటిటి లో కూడా ఉంది చూడని వారు ఎవరైనా చూడొచ్చు.