తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ).ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నాడు.
ఇక మీదట నుంచి వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ఉండడం వల్ల దాదాపు ఒక ఆరు నెలలు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే తను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే రీసెంట్ గా అట్లీ( Director Atlee )తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్( AP Elections ) లో ఎక్కువ సీట్లను గెలిచినట్లయితే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఒకవేళ అదే నిజమైతే అట్లీతో చేసే సినిమానే పవన్ కళ్యాణ్ కి చివరి సినిమాగా అవుతుంది అంటూ మరి కొంతమంది పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు.ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అటు సినిమా, ఇటు రాజకీయాలు రెండింటిని మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కలుతాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు సినిమాలని, రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు అనే డౌట్లు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఎలక్షన్స్ ముగిసిన తర్వాత సినిమాలని కంటిన్యూ చేస్తూ రాజకీయాలను( Pawan Kalyan Politics ) కూడా చేస్తాడా లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఒక రాజకీయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఒక వేళ ఆయన సినిమాలను ఆపేస్తే మాత్రం అట్లీ సినిమానే ఆయనకి చివరి సినిమా అవుతుంది… ఇక చేస్తే ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని స్క్రీన్ మీద చూడలేరనే చెప్పాలి.