Rashmika : రెమ్యూనరేషన్ వార్తలపై స్పందించిన రష్మిక.. ఆలోచించాల్సిన విషయమంటూ కామెంట్స్?

సినీ నటి రష్మిక( Rashmika ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

 Rashmika Mandanna React On Remuneration Increase News-TeluguStop.com

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో కూడా ఈమెకు మరింత క్రేజ్ పెరిగింది.

ఇలా వరుస హిట్ సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి రష్మిక రెమ్యూనరేషన్ ( Remuneration )కూడా భారీగా పెంచేశారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా ఈమె నిలిచారని వార్తలు వచ్చాయి.ఈమె ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన తరుణంలో ఈ వార్తలపై రష్మిక స్పందించారు.

ఈ విధంగా తన రెమ్యూనరేషన్ పెరిగింది అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఈమె స్పందించారు.నేను రెమ్యూనరేషన్ పెంచానని ఎవరు చెప్పారు.ఈ వార్తలను చూసి నాకే ఆశ్చర్యం కలుగుతుందని అయినా మీరు చెప్పే ఈ విషయాన్ని నిజం చేస్తే సరిపోతుంది ఈ విషయం గురించి నేను కూడా ఆలోచించాల్సి ఉంటుంది.

నేను కూడా నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తానని, మీడియానే రెమ్యూనరేషన్ పెంచామని చెబుతున్నారు వారి మాటలకు నేను కట్టుబడి ఉంటాననీ నిర్మాతల వద్ద చెబుతాను అంటూ ఫన్నీ గానే ఈమె రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలపై సెటైర్లు వేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube