హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Director Sivabalakrishna ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో నవీన్ కుమార్( Naveen Kumar ) కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.దీంతో నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
అలాగే ఇవాళ సాయంత్రం శివబాలకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది.కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.







