తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ( Budget Meetings of Telangana Assembly )రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి.ఈ క్రమంలోనే మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundara Rajan ) ప్రసంగించనున్నారు.

ఇప్పటికే గవర్నర్ తమిళిసై స్పీచ్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే మరోవైపు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతుంది.







