ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను కలిగి ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఒకరు.భారీ స్థాయిలో తన సినిమాల ద్వారా లాభాలను అందుకుంటున్న ఈ దర్శకుడు తన సినిమాల గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే ఘాటుగా జవాబిస్తున్నారు.
తాను యానిమల్ గురించి స్పందించలేదని అమీర్ ఖాన్ భార్య చెప్పగా ఆమె కామెంట్లకు యానిమల్ టీం( Animal Movie ) ప్రూఫ్స్ తో సహా కౌంటర్ ఇచ్చింది.యానిమల్ సినిమా గురించి విమర్శలు చేసిన వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు.
ఆమె ఈ సినిమా గురించి స్పందిస్తూ మహిళలను శృంగార వస్తువులుగా భావించి బూట్లు నాకమని అడిగే హీరోల సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని మహిళా సాధికారత సినిమాలు చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేస్తుందని కంగనా రనౌత్ వెల్లడించారు.
కంగనా( Kangana Ranaut ) చేసిన కామెంట్ల గురించి సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు.కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదని విమర్శించినా తప్పు లేదని నేను తీసే సినిమాలలో ఆమెకు సరిపోయే రోల్ ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతానని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.సందీప్ కామెంట్ల గురించి కంగనా స్పందిస్తూ సినిమాను సమీక్షించడానికి విమర్శించడానికి తేడా ఉందని అన్నారు.
ముందుగా అది తెలుసుకోవాలని వెల్లడించారు.యానిమల్ సినిమాపై నా విమర్శల గురించి సందీప్ నవ్వుతూ మాట్లాడారని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
అక్కడే సందీప్ కు నాపై ఉన్న గౌరవం అర్థమవుతుందని ఆమె తెలిపారు.మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వవద్దని అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్ లు( Feminists ) అవుతారని కంగనా చెప్పుకొచ్చారు.అది మీకే డేంజర్ కావచ్చని కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలని ఉండాలని కంగనా కామెంట్లు చేశారు.