తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మొదటి వరుసలో ఉన్నారు.ఇక వీళ్లిద్దరూ కూడా ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ వస్తున్నారు.
నిజానికి వీళ్ళిద్దరూ యాక్టింగ్ ని కూడా వైజాగ్ సత్యానంద్( Vizag Satyanand ) గారి దగ్గరే నేర్చుకోవడం విశేషం.ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ అయింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన పైరసీ ఎక్కువగా జరుగుతుండటం తో అప్పుడు ఆ పైరసీ వీడియోలను పట్టుకోవడంలో మహేష్ బాబు తో పాటు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

అప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు.నిజానికి అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న ఏ ఒక్క స్టార్ హీరో కూడా మహేష్ కి సపోర్ట్ గా రాలేదు.కానీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రం నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు.
ఇక అప్పటి నుంచి ఇద్దరి వ్యక్తిత్వాలు కలిసి ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు.ఆ తర్వాత జల్సా సినిమా( Jalsa Movie ) కోసం మహేష్ బాబు తన వాయిస్ ని ఇవ్వడం కూడా మనం చూశాం…

అలా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అనేది ఒక స్టేజ్ లో ఒక్కోలా ఎలివేట్ అవుతూ వస్తుంది…ఇక ఇప్పటికీ కూడా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక వీళ్ళు ఎక్కువగా కలుసుకొకపోయిన కూడా వీళ్ళు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ ఉంటారు.








