ఊరికే రైతుబంధు వేస్తున్న అధికారులు...!

నల్లగొండ జిల్లా: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గర్నేకుంట గ్రామంలో నివాస సముదాయానికి రైతు బంధు పడుతున్న విషయమై గ్రామానికి చెందిన చేడోజు విశ్వనాథం ఎమ్మార్వోకి మండల తహశీల్దార్ కి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం…గర్నేకుంట గ్రామంలో గత 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 240/అ లో గ్రామానికి బాణాల లింగరావు తనకున్న 5 ఎకరాల 27 కుంటల వ్యవసాయ భూమిని ఇళ్ళ స్థలాల కోసం విక్రయించారు.

 Rythu Bandhu For Uneligible Persons In Nalgonda District, Rythu Bandhu ,uneligib-TeluguStop.com

అందులో అప్పటి నుండి 35 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకోని జీవనం సాగిస్తున్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పుణ్యమా అని

నివాసముండే ఆ భూమి విక్రయించిన రైతు లింగారావు పేరు మీద ఉండడంతో ఐదు సంవత్సరాల నుండి రైతుబంధు డబ్బులు వేస్తున్నారు.

నివాస స్థలాన్ని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రైతుబంధు డబ్బులు తీసుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.అయినా ఎలాంటి చర్యలు తీసుకాకుండా అలాగే కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.

ఇప్పటికైనా ఆ సర్వే నెంబర్ భూమిపై సమగ్ర విచారణ జరిపి, రైతుబంధును నిలుపుదల చేయాలని,ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube