సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల( Ananthagiri ) పరిధిలోని శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం పప్పు కుక్కర్ పేలడంతో అభినవ్ (02) హరీష తంసి(02) అనే ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలను హుటాహుటిన కోదాడ( Kodad ) ప్రైవేట్ హాస్పటల్ గా తరలించగా డాక్టర్ సలహా మేరకు సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెయిన్ బో హాస్పటల్ కు తరలించారు.శాంతినగర్ అంగన్వాడి సెంటర్( Anganwadi centre ) లో జరిగిన ఘటనపై విచారణ చేస్తామని సిడిపిఓ పర్వతా తెలిపారు.
కుక్కర్ పేలుడు ఘటనలో గాయపడిన బాబుకు సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రికి తరలించామని,జిల్లా కలెక్టర్ స్పందించి బాబు వైద్యానికి అయ్యే ఖర్చు పెట్టుకుందామన్నారు.అంగన్వాడి టీచర్, ఆయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.