Ginger Crop : అల్లం పంటకు తీవ్ర నష్టం కలిగించే పుసారియం విల్ట్ శిలీంద్రంను అరికట్టే పద్ధతులు..!

అల్లం పంటకు( ginger crop ) తీవ్ర నష్టం కలిగించే పుసారియం విల్ట్ శిలీంద్రం( Wilt fungus ) మొక్కల కణజాలంలోకి ప్రవేశించి పోషకాలు మొక్కకు చేరకుండా అడ్డుకుంటుంది.మొక్కల వేరు చివర్ల తగిలిన దెబ్బల ద్వారా ఈ శిలీంద్రం మొక్కలోకి ప్రవేశిస్తుంది.

 Methods To Prevent Pusarium Wilt Fungus Causing Severe Damage To Ginger Crop-TeluguStop.com

ఇవి ఒక ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని స్థిరపడి, ఎన్నో సంవత్సరాలపాటు జీవిస్తుంది.

అల్లం మొక్కలు క్రమంగా ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారడం, ఆ తర్వాత వాలిపోవడం జరిగితే ఆ మొక్కకు ఈ శిలీంద్రం ఆశించినట్టే.

పగలు అధిక ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగుళ్ల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.ఈ తెగుళ్లు ముందు మొక్క మొదలలో కనిపిస్తుంది.ఆ తర్వాత కాండంకు వ్యాపిస్తుంది.

Telugu Blackplastic, Copper, Oxysporum, Ginger Crop, Pusariumwilt-Latest News -

తెగుళ్లు ఆశించిన మొక్కలకు ఎండ తగలకుండా మధ్యాహ్న సమయం ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్( Black plastic cover ) తో ఒక నెలపాటు కప్పి ఉంచితే, ఆ శిలీంద్రం చనిపోతుంది.పంట కోతల తర్వాత పంట అవశేషాల్ని పొలం నుంచి తొలగించి వేసవికాలంలో పొలాన్ని లోతు దుక్కులు దున్నాలి.తెగులు నిరోధక రకాలను ఉపయోగించాలి.

Telugu Blackplastic, Copper, Oxysporum, Ginger Crop, Pusariumwilt-Latest News -

ఈ పుసారియం విల్ట్ శిలీంద్రంను నియంత్రించడం కోసం ఎఫ్.ఒక్సిస్పోరం( F.oxysporum ) జీవ నియంత్రణ ఏజెంట్లను ఉపయోగించాలి.నేల యొక్క పీహెచ్ విలువను 6.5 నుంచి 7 మధ్య నియంత్రిస్తే ఈ శిలీంద్రం తీవ్రత తగ్గుతుంది.అల్లం పంట వేసే ముందు మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) ను ఒక లీటరు నీటిలో కలిపి నేలను తడపాలి.

ఒక కేజీ విత్తనాలను 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి.పంట పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే వాటిని పీకేస్తే వ్యాప్తి ఎక్కువగా ఉండదు.

ఈ తెగుళ్లు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నియంత్రించే పద్ధతులు అందుబాటులో లేవు.కాబట్టి ఈ తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube