జంతువులు అప్పుడప్పుడు అనుకోకుండా ప్రమాదాల్లో చిక్కుకుపోతాయి.వాటిని చూసినప్పుడు కొందరు దయతో కాపాడుతుంటారు.
అయితే తమను కాపాడిన మనుషులకు ఈ జంతువులు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాయి.ఇప్పటికే అలాంటి హార్ట్ టచింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి.
తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియో ప్రకారం, ఓ వ్యక్తి గుంటలో పడిపోయిన ఓ జింక( Deer ) పిల్లను రక్షించాడు.
ఆపై మళ్లీ అది బలంగా అయ్యేలా చూసుకుంటున్నాడు.అనంతరం ఆ పిల్లను దాని తల్లితో తిరిగి ఐక్యం చేశాడు.
దీంతో తల్లి బాగా సంతోషించింది.ఇక జింక పిల్ల చాలా కృతజ్ఞతతో ఆ వ్యక్తి ముందు పడుకొని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసింది.
ఒక నెల తరువాత, జింక పిల్ల తనను కాపాడిన వ్యక్తి ఇంటికి వచ్చింది.అయితే అది ఒక్కటే రాలేదు.అది తన కుటుంబాన్ని కూడా తనతో పాటు తీసుకు వచ్చింది.అవన్నీ ఆ వ్యక్తి గ్యారేజీ వద్ద కనిపించాయి.వాటన్నిటినీ చూసి సదరు వ్యక్తి ఆశ్చర్యపోయారు.జింక పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అవి అతని ఇంటికి గుంపుగా వచ్చాయి.
ఈ దృశ్యం చూసేందుకు మనసును హత్తుకునేలా అనిపించింది.
అటవీ శాఖ అధికారి, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద( Susanta nanda ) ఈ క్యూట్ వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా పంచుకున్నారు.జంతువులు మనుషులతో ఎలా స్నేహంగా ఉంటాయో చెప్పే అందమైన కథ ఇదని అన్నారు.చాలా మంది ఈ వీడియోను చూసి హ్యాపీగా ఫీలయ్యారు.
ఇది చాలా హృద్యంగా ఉందని వారు కామెంట్లు చేశారు.జింకల పట్ల మనిషి చూపించిన దయ, జింకలు వ్యక్తం చేసిన కృతజ్ఞతా భావాన్ని ప్రశంసించారు.
ఇది అరుదైన, అద్భుతమైన దృశ్యమని అన్నారు.