తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పాయల్ రాజపుత్( Heroine Payal Rajput ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఆర్ఎక్స్ 100( RX100 ).
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.
ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.అప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చిన్నా చితకా చిత్రాలు, ప్రాజెక్టులు, సీరియల్స్ చేస్తూ ఎలాంటి గుర్తింపు లేకుండా నార్త్‌లో ఉండిపోయింది.
![Telugu Mangalavaram, Payal Rajput, Photoshoot, Rx, Tollywood-Movie Telugu Mangalavaram, Payal Rajput, Photoshoot, Rx, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/payal-rajput-new-film-mangalavaram-update.jpg)
కానీ ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ కెరీర్ మారిపోయింది.తెలుగులో ఒక్కసారిగా హాట్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో చర్చలకు దారి తీసింది.పాయల్ రాజ్‌పుత్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.ఆర్ఎక్స్ 100 సినిమా పేరు మీద పాయల్‌కు లెక్కలేనంత క్రేజ్,డిమాండ్ ఏర్పడింది.ఆ తరువాత కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి.పాయల్ రాజపుత్ ఇటీవల మంగళవారం( Mangalavaram ) అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.
ఈ సినిమాకు కూడా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
![Telugu Mangalavaram, Payal Rajput, Photoshoot, Rx, Tollywood-Movie Telugu Mangalavaram, Payal Rajput, Photoshoot, Rx, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Actress-Payal-Rajput-Shares-Her-First-Photoshoot-Photos-Viral.jpg)
ఇది ఇలా ఉంటే పాయల్ రాజ్ పుత్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.తన మొదటి ఫోటో షూట్( Payal RajputFirst Photoshoot ) అనుభవాల్ని పంచుకుంది.21 ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి వచ్చిందట.అప్పుడే తన తొలి ఫోటో షూట్ చేయించుకుందట.ఇదే ఆ ఫోటో అని కూడా నాటి లుక్ అంటూ ఆ ఫోటోని షేర్ చేసింది.ఒక మ్యాగజైన్ కోసం మొదటి సారిగా ఫోటో షూట్ చేయించుకుందట.ఢిల్లీలో ఈ ఫోటో షూట్ జరిగిందని, తరువాత పాయల్ ముంబైకి షిఫ్ట్ అయినట్లు ఆమె తెలిపింది.
ఆ తరువాత సీరియల్స్ తో టెలివిజన్ రంగంలో కెరీర్ ప్రారంభించింది పాయల్.ఈ మేరకు పాయల్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ మ్యాటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.