బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ బూట్ కట్ బాలరాజు ( Boot Cut Balaraju )సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఫ్రస్టేషన్ తో కన్నీళ్లు పెట్టుకుంటూ కామెంట్లు చేశారు.అయితే సోహెల్( Sohel ) కామెంట్ల గురించి పాజిటివ్ గా కంటే ఎక్కువమంది నెగిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
కథ అద్భుతంగా లేకపోతే బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున సినిమాలే చూడటం లేదని నెటిజన్లు చెబుతున్నారు.
కథ అద్భుతంగా ఉంటే చిన్న సినిమా అయిన హనుమాన్ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో అదే స్థాయిలో హిట్ అవుతాయని కంటెంట్ నచ్చకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చుసే పరిస్థితి లేదని నెటిజన్లు చెబుతున్నారు.
బూట్ కట్ బాలరాజు సినిమాకు క్రిటిక్స్ నుంచి సైతం ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.సోహెల్ ఎమోషనల్ కావడం వల్ల సినిమాకు మరింత నెగిటివ్ అవుతోంది.

ప్రేక్షకులు హీరో విషయంలో సైతం ఆలోచించే రోజులు లేవని మంచి కంటెంట్ తో తెరకెక్కుతుందా? లేదా? అనే ప్రశ్నలు మాత్రమే వాళ్లకు ఉంటాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.హనుమాన్ మూవీ విడుదలై 20 రోజులు దాటినా ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయని మరి బూట్ కట్ బాలరాజుకు ఎందుకు ఆక్యుపెన్సీ లేదో సోహెల్ అర్థం చేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించి ఒక్క టికెట్ కూడా బుక్ కాని పరిస్థితులు ఉన్నాయి.టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను మెప్పిస్తే సినిమాలు ఊహించని స్థాయిలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.తప్పు ఎక్కడ జరిగిందో సోహెల్ అర్థం చేసుకోవాల్సి ఉంది.సోహెల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అయినా విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







