Donald Trump : అమెరికా : ట్రంప్ సంపాదనంతా లీగల్ ఫీజులకే .. అన్ని మిలియన్ డాలర్ల ఖర్చా..?

రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఆర్ధిక పెట్టుబడులు, చట్టపరమైన విషయాలు , అధ్యక్ష ఎన్నికల ముందు దివాలా తదితర తప్పిదాల కారణంగా గడిచిన రెండేళ్లలో లీగల్ ఫీజుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.న్యూయార్క్ యూనివర్సిటీ అకౌంటింగ్ ప్రొఫెసర్ అయిన ఎలి బార్టోవ్‌లో( Eli Bartov ) ట్రంప్ పెట్టుబడులు పెట్టడం ఆయనపై ఆర్ధికంగా మరింత ఒత్తిడిని పెంచుతోంది.

 Donald Trump Spends 76 Million On Attorneys As Legal Troubles Mount Ahead Of Us-TeluguStop.com

ఫెడరల్ ఎలక్షన్ కమీషన్‌కు దాఖలు ప్రకారం.డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని భయపెడుతోన్న న్యూయార్క్ అటార్నీ జనరల్ సివిల్ ఫ్రాడ్ కేసులో నిపుణుల సాక్షిగా ట్రంప్‌‌కు చెందిన సేవ్ అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ గతేడాది బార్టోవ్‌కు దాదాపు 9,30,000 డాలర్లు చెల్లించింది.

Telugu York Professor, Press, Donald Trump, Eli Bartov, Fec, Save America-Telugu

కొత్త ఫెడరల్ ఎన్నికల కమీషన్ ఫైలింగ్‌లపై అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో ట్రంప్ రాజకీయ నిధుల సేకరణ యంత్రాంగం ద్వారా గతేడాది చేసిన చట్టపరమైన ఖర్చులలో బార్టోవ్‌కు 54 మిలియన్ల చెల్లింపులు వున్నాయని చూపింది.నాలుగు క్రిమినల్ కేసుల్లో బహుళ వ్యాజ్యాలు , డజన్ల కొద్దీ నేరారోపణలతో పోరాడుతున్నందున ట్రంప్ .న్యాయవాదులు, లీగల్ ఖర్చుల కోసం భారీగా వ్యయం చేస్తున్నారు.ఈ చెల్లింపుల్లో ఎక్కువ భాగం సేవ్ అమెరికా నుంచే వచ్చాయి.

ఈ కమిటీ మొత్తం వ్యయంలో 84 శాతం లీగల్ ఫీజుల వైపు వెళ్తోందని గణాంకాలు చెబుతున్నాయి.

Telugu York Professor, Press, Donald Trump, Eli Bartov, Fec, Save America-Telugu

2022 నుంచి ఎఫ్‌ఈసీ డేటాతో( FEC data ) కలిపి అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన సమీక్షలో సేవ్ అమెరికా, ట్రంప్ అధ్యక్ష ప్రచార బృందం, అతని ఇతర నిధుల సమీకరణ సంస్థలు రెండేళ్లలో 76.7 మిలియన్లను న్యాయపరమైన రుసుములకు కేటాయించినట్లుగా కనుగొంది.2024 రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖాయం చేసుకునే దిశగా సాగుతున్న ట్రంప్ ఎదుర్కొంటున్న చట్టపరమైన ఆపదను.ఈ భారీ వ్యయం నొక్కి చెబుతోంది.ట్రంప్‌కు సంబంధించి చట్టపరమైన అంశాలను డీల్ చేస్తున్న న్యాయవాదులంతా 5 మిలియన్ డాలర్లకు పైగా లీగల్ ఫీజులను అందుకున్నారని ఎఫ్‌ఈసీ ఫైలింగ్ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube