బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీ(BJP LK Advani )కి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని పేర్కొన్నారు.మన కాలంలో అత్యంత రాజనీతిజ్ఞులలో ఎల్.కే అద్వానీ ఒకరని కొనియాడారు.అట్టడుగు స్థాయిలో పని చేయడం నుంచి దేశ ఉప ప్రధానమంత్రిగా సేవలందించారు.1980లో జనసంఘ్ నుంచి విడిపోయిన తరువాత బీజేపీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.

బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అయోధ్య రామాలయం( Ayodhya Temple ) కోసం రథయాత్ర కూడా చేసిన సంగతి తెలిసిందే.అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







