సాధారణంగా నీటిపై నడవడం లేదంటే స్కియింగ్, స్లైడింగ్( Sliding ) చేయడం అసలు కుదరదు.ఇలాంటి పనులు ఐసు లేదా మరే ఇతర అమృతవైన ఉపరితలాలపై మాత్రమే సాధ్యమవుతుంది.
అయితే ఆ భావన తప్పు అని ఓ వ్యక్తి నిరూపించాడు.దానికి అతను ఫిజిక్స్ ఉపయోగించాడు.
ఓన్లీ నీటి పైనే అతడు స్లైడింగ్ చేయకుండా ఒక మంచు కొండపై నుంచి వేగంగా స్లైడింగ్ చేస్తూ వస్తువు నీటి సరస్సు పైకి దూసుకు వచ్చాడు.ఆ వేగంలో అతడు నీటిలో మునిగిపోలేదు ముందుకి అలాగే వెళ్ళగలిగాడు.
ఈ దృశ్యం చూసేందుకు అద్భుతంగా అనిపించింది.దీనికి సంబంధించిన వీడియో @TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

ఈ వీడియోకు ఇప్పటిదాకా రెండు కోట్ల 35 లక్షల వ్యూస్ వచ్చాయి.1,30,000కు పైగా లైక్స్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక మంచు పర్వతం పైనుంచి కిందకి వేగంగా స్లైడింగ్ చేసుకుంటూ వస్తున్న స్కియర్( Skier ) ను చూడవచ్చు.అలా స్లైడింగ్ చేసుకుంటూ అతడు నాలుగు స్విమ్మింగ్ పూల్ అంత పెద్దగా ఉన్నా సరస్సులోకి దూసుకుని వెళ్లాడు.
అతడు ఆ సరస్సుపై మునిగిపోలేదు.అంతే ముందుకు వెళ్లిపోయాడు.
మొమెంటమ్( Momentum ) అనే ఒక ఫిజిక్స్ సూత్రం ఫాలో అవుతూ ఈ పని చేయగలిగాడని వీడియోకి ఒక క్యాప్షన్ ఇచ్చారు.అదే అతడు వేగంగా రాకపోయి ఉంటే నీటిపై స్లైడ్ చేయడం కుదరకపోయేది.

అయితే ఈ స్టంట్ చేసిన వ్యక్తి దృశ్యాలను కెమెరామెన్ అద్భుతంగా రికార్డు చేశాడని నెటిజన్లు పొగుడుతున్నారు.కాస్త వేగం ఉంటే చాలు నీటిపై ఇలాంటి విన్యాసాలు ఎన్నో చేయొచ్చు ఇది అసాధ్యంగా అనిపించొచ్చు కానీ సాధ్యమే, ఫిజిక్స్ చాలా క్రేజీ సైన్స్ అని ఇంకొకరు అన్నారు.ఇలాంటి స్టంట్స్ మేం కూడా ట్రై చేస్తామని ఇంకొందరు పేర్కొన్నారు.వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.







