ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ( Sankranti festival ) అంటే సినిమాలకు సంబంధించి ఊహించని స్థాయిలో పోటీ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.2025 సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ పోటీ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.చిరంజీవి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.బాలయ్య బాబీ మూవీ భారీ బడ్జెట్ మూవీ కావడంతో అదే సమయానికి ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
వెంకీ అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతోంది.నాగార్జున ( Nagarjuna )సైతం తన సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తానని చెప్పారు.
బంగార్రాజు ( Bangarraju movie ) సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.నలుగురు సీనియర్ హీరోలు పోటీ పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పవచ్చు.
ఈ నలుగురు హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్( Chiru, Balayya, Nag, Venkatesh ) బాక్సాఫీస్ వద్ద ఒకే సమయంలో పోటీ పడిన సందర్భాలు అయితే లేవు.2025 సంవత్సరంలో మాత్రం ఈ నలుగురు పోటీ పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తెరకెక్కుతుండటంతో అన్ని సినిమాలు ఒకే సమయంలో విడుదల అవుతుండటం గమనార్హం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.చిరు, బాలయ్య, నాగ్, వెంకీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఈ నలుగురు హీరోలు వయస్సు పెరుగుతున్నా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.ఈ స్టార్ హీరోలు ఇతర భాషల్లో సైతం మరింత సత్తా చాటాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.