తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.ఈ మేరకు కొత్త రాజకీయ పార్టీని ఇళయ దళపతి విజయ్ జోసెఫ్( Vijay ) ప్రకటించారు.

‘తమిళగ వెట్రి కళగం( Tamilaga vettrI kazhagam )’ పేరుతో పార్టీని విజయ్ ప్రకటించారు.సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇవ్వడం లేదన్న ఆయన 2026 తమళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని తెలిపారు.ఈక్రమంలోనే పార్టీ జెండా, ఎజెండాను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.తమిళనాడు ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని విజయ్ పేర్కొన్నారు.అయితే విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం.







