మాజీ మంత్రి బాలినేని( Balineni Srinivasa Reddy ) తమ నాయకుడని మంత్రి మేరుగ నాగార్జున( Merugu Nagarjuna ) అన్నారు.బాలినేని ఆధ్వర్యంలోనే తామంతా పని చేస్తామని చెప్పారు.
ఫ్లెక్సీలు తన క్యాంపు కార్యాలయంలో చిరగలేదన్న ఆయన బయట ధ్వంసం అయ్యాయని తెలిపారు.

అనంతరం పీసీసీ చీఫ్ షర్మిలపై( PCC chief Sharmila ) స్పందించిన మేరుగ నాగార్జున ఆమెకు ప్రత్యేక హోదా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు.ఢిల్లీలో షర్మిల దీక్ష ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలన్నారు.చంద్రబాబు పంపిస్తేనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.
చంద్రబాబు డ్రామాల్లో ఇదొక భాగమని ఆరోపించారు.







