మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) ఇటీవల కాలంలో కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా ఈమె గుర్తింపు సంపాదించుకున్నారు.
యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్గా మూడు సినిమాలలో నటించారు.అయితే ఈ మూడు సినిమాల ద్వారా ఈమె ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇక పెళ్లి తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని నిహారిక ప్రయత్నాలు చేశారని అందుకు తన అత్తింటి వారు ఒప్పుకోలేదని ఇటీవల కాలంలో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా తన భర్తకు తనకు మధ్య మనస్పర్ధలు రావడంతో నిహారిక తన భర్తకు విడాకులు ( Divorce ) తీసుకున్నారు.అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఈమె నిర్మాణ సంస్థను ప్రారంభించారు.అదే విధంగా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతున్నారని తెలుస్తుంది.మంచు మనోజ్ ( Manchu Manoj ) హీరోగా నటిస్తున్న వాట్ ది ఫిష్( What the Fish ) అనే సినిమాలో నిహారిక నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు తాజాగా మరో సినిమాకి కూడా ఈమె కమిట్ అయ్యారని తెలుస్తుంది.

నిహారిక తెలుగు మాత్రమే కాకుండా మలయాళ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మద్రాస్ కారన్( Madraskaaran ) టైటిల్ తో ఈ మలయాళ చిత్రం తెరకెక్కుతుంది.షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. మద్రాస్ కారన్ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకుడు.నిహారికకు ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ పెద్దగా సక్సెస్ సాధించలేని నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ సాధించడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.మరి ఇప్పుడైనా ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.







