మూగ జంతువులు కొన్నిసార్లు పొరపాటున ప్రమాదాల్లో పడుతుంటాయి.చావు అంచుకు వెళ్లి సమయస్ఫూర్తితో బయటపడే కొన్ని జంతువులు ఉంటాయి.
కొన్ని చావు నుంచి తప్పించుకోలేం అనుకుంటూ మృత్యువుకు తలవంచుతాయి.మరి కొన్ని జంతువులకు మాత్రం ప్రాణాలను రక్షించుకునే అవకాశాలు అసలు కనిపించవు.
అంతలా అవి ప్రాణాపాయ స్థితిలో పడిపోతుంటాయి.అయితే కొందరు మనుషులు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని కాపాడుతుంటారు.
నిజానికి ఈ పరిస్థితులలో వాటిని రెస్క్యూ చేయాలంటే ధైర్యంతో పాటు దయ, జాలి, కరుణ ఉండాలి అలాంటి లక్షణాలు ఉన్న ఒక మహిళ తాజాగా ఒక కుక్క పిల్లను రక్షించి సోషల్ మీడియాలో హీరోగా మారింది.ఆమె కుక్క పిల్లను రెస్క్యూ చేసిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతోంది.

@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటిదాకా ఒక కోటి 70 లక్షల వ్యూస్ వచ్చాయి.ఆ వీడియో ఓపెన్ చేస్తే ఒక బ్రిడ్జి అంచున ఒక కుక్క పిల్ల నిల్చొని ఉండటం చూడవచ్చు.అది ఒక బ్రిడ్జి పిల్లర్ మీద ఉంది.అక్కడినుంచి అది కింద పడితే చచ్చిపోవడం ఖాయం.అది బ్రిడ్జి మీదకి కూడా రాలేదు ఎందుకంటే ఒక ప్రొటెక్టివ్ రైయిలింగ్ అడ్డుగా ఉంది.దీనివల్ల కుక్క ఆ పిల్లర్ అంచున కూర్చొని ఉండటం తప్ప అక్కడ నుంచి బయటపడే ఛాన్సే లేదు.
ఎవరైనా దానిని పట్టుకోడానికి ట్రై చేసినా అది దూకేసే ప్రమాదం ఉంది.లేదంటే కరిచేసి అది పొరపాటున కింద పడే అవకాశం కూడా ఉంది.

ఇన్ని సవాళ్లు ఉన్నా ఒక మహిళ మాత్రం ధైర్యం చేసే కుక్కపిల్లను రక్షించడానికి ముందుకు వచ్చింది.ఆమె రైయిలింగ్ పైనుంచి దూకి మోకాళ్లపై కూర్చొని కుక్కను చాలా చాకచక్యంగా పట్టేస్తుంది.ఆ సమయంలో పప్పీ కాస్త ప్రతిఘటించింది.అయినా ఆమె దానిని వదిలిపెట్టలేదు, చాలా జాగ్రత్తగా బ్రిడ్జి మీద ఉన్న ఇతరులకు అందజేసింది.కుక్క అసలు అటువైపు ఎందుకు వెళ్లిందో, ఎలా వెళ్ళిందో తెలియ రాలేదు బహుశా ఎవరైనా దానిని అక్కడ వదిలేసి ఉండవచ్చు.ఏది ఏమైనా దాని ప్రాణాలను ఈ మహిళ కాపాడి అందరి మెప్పు పొందుతోంది.
ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.







