Sobhan Babu : పైసా చేతిలో పడితేనే షూటింగ్ కి వచ్చే స్టార్ హీరో.. ఎవరంటే..?

సాధారణంగా చాలామంది నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు.అయితే కొందరికి నటనతో పాటు డబ్బుపై కూడా చాలా ఎక్కువ మోజు ఉంటుంది.

 Sobhan Babu Behaviour About Money-TeluguStop.com

దానికి కారణం ఏదైనా కావచ్చు.ఇప్పుడంటే ఆర్థిక పరిస్థితి బాగున్నవారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తున్నారు.

కొందరు టాలెంట్ తో స్మాల్ స్క్రీన్, సోషల్ మీడియా, సినిమాలు( Small screen, social media, movies ) వంటి వివిధ మార్గాల ద్వారా నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.కానీ ఒకప్పుడు పేదనటులకు సినిమా నుంచి లభించే డబ్బులే జీవనాధారంగా ఉండేవి.

ఆ డబ్బులు కూడా చాలా తక్కువగా లభించాయి.దీనివల్ల సినిమాలు చేసిన నటీనటుల వద్ద ఎక్కువ డబ్బులు ఉండేవి కావు.

ఒక్క సినిమా నిర్మాత సరిగ్గా పేమెంట్ చేయకపోయినా ఆకలితో అలమటిస్తూ పడుకున్న నటీనటులు కూడా ఉన్నారు.ఇలాంటి ఇబ్బందులు పడిన వారిలో సోగ్గాడు శోభన్ బాబు( Shobhan Babu ) కూడా ఉన్నాడు.

కెరీర్ తొలినాళ్లలో ఈ హీరో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు.అప్పుడే అతనికి డబ్బు విలువ ఏంటో తెలిసి వచ్చింది.అందుకే కెరీర్ ప్రారంభంలో డబ్బు విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉండేవాడు.కెరీర్ లైఫ్ చివరి వరకు అదే ప్రవర్తనను అనుసరించాడు.

ఈ హ్యాండ్సమ్ హీరో చేతిలో డబ్బు పడితే తప్ప షూటింగ్ స్పాట్ కి రాననే మొండి పట్టుదల చూపించేవాడని అప్పట్లో మాట్లాడుకునేవారు.

Telugu Small Screen, Sobhan Babu, Tollywood-Telugu Top Posts

ప్రొడ్యూసర్ ( Producer )ఇచ్చిన మాట ప్రకారం డబ్బు ఇవ్వకపోతే, శోభన్ బాబు ఆ సినిమాకి వెళ్లని సందర్భాలు ఉన్నాయని కూడా కొందరు చెబుతుంటారు.మనీ వసూలు చేసే విషయంలో అంత కఠినంగా వ్యవహరించారు కాబట్టే చివరికి చాలా డబ్బును శోభన్ బాబు సంపాదించగలిగాడు.నిజానికి సినిమాల నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా అతను భూములను కొనుగోలు చేయడానికి వెచ్చించేవాడు.

Telugu Small Screen, Sobhan Babu, Tollywood-Telugu Top Posts

ఒక సినిమాకి ఫలానా మొత్తంలో పారితోషికం ఇస్తానని చెప్పినప్పుడే ఆ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని ఆలోచిస్తూ శోభన్ బాబు ఉండేవాడు.సినిమా ప్రారంభం కాగానే ఆ డబ్బుతో ఎక్కడ ఫ్లాట్ కొనాలో నిర్ణయించుకునే వాడు.ఆ వివరాలను ఒక నోట్ బుక్ లో రాసుకునేవాడు.షూటింగ్ సమయంలో కూడా ఆ పెట్టుబడి వివరాలను పదేపదే చెక్ చేసుకునేవాడు.ఇంత ప్లానింగ్ చేస్తున్నప్పుడు నిర్మాత డబ్బు విషయంలో ఏదైనా ఆలస్యం చేస్తే అతను అసలు సహించేవాడు కాదు.ఎవరేమనుకున్నా సరే ఆ పద్ధతిని చివరి వరకు శోభన్ బాబు కొనసాగించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube