హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Sivabalakrishna )ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.ఉస్మానియా ఆస్పత్రి( Osmania Hospital )లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.
అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఉన్న ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.కేసు విచారణలో భాగంగా శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో సుమారు 16 చోట్ల ఏసీబీ అధికారులు( ACB officials ) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే భారీగా నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు ఏసీబీ యాక్ట్ లోని యూ/ఎస్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.